✨ ఏఐ ముఖ్యాంశాలు (AI Key Bullets)
  • ఈ వార్తకు సంబంధించిన అత్యంత ముఖ్యమైన తాజా సమాచారం.
  • ప్రభుత్వం మరియు అధికారుల నుంచి వచ్చిన అధికారిక ప్రకటనలు.
  • ప్రజలు తెలుసుకోవాల్సిన ముఖ్యాంశాలు మరియు తదుపరి పరిణామాలు.

విజయనగరం జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడిగా బెల్లాన చంద్రశేఖర్

  • నెల్లిమర్ల ఇన్‌ఛార్జ్‌గా గదల సన్యాసినాయుడు

తాడేపల్లి/విజయనగరం:విజయనగరం జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో అధిష్ఠానం కీలక మార్పులు చేపట్టింది. పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు జిల్లాకు సంబంధించి నూతన నియామకాలను ఖరారు చేస్తూ వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయం అధికారిక ప్రకటన విడుదల చేసింది.
జిల్లా అధ్యక్షుడిగా బెల్లాన: ఇటీవల వైఎస్సార్‌సీపీకి రాజీనామా చేసిన మజ్జి శ్రీనివాసరావు స్థానంలో, విజయనగరం జిల్లా పార్టీ అధ్యక్షుడిగా మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్‌ను నియమించారు.
నెల్లిమర్ల సమన్వయకర్తగా గదల: నెల్లిమర్ల అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా గదల సన్యాసినాయుడుని నియమిస్తూ అధిష్ఠానం నిర్ణయం తీసుకుంది.
రాజకీయ సమీకరణాలు:
నెల్లిమర్ల ప్రస్తుత సమన్వయకర్త బడ్డుకొండ అప్పలనాయుడు స్థానంలో సన్యాసినాయుడుని నియమించడం స్థానికంగా రాజకీయ చర్చకు దారితీసింది. టీడీపీలో చేరిన మజ్జి శ్రీనివాసరావుకు బడ్డుకొండ స్వయానా వియ్యంకుడు కావడంతో, తాజా రాజకీయ పరిణామాలను దృష్టిలో ఉంచుకుని పార్టీ ఈ మార్పు చేసినట్లు తెలుస్తోంది.
క్షేత్రస్థాయిలో కేడర్‌ను సమన్వయం చేసుకుంటూ, జిల్లాలో పార్టీ కార్యకలాపాలను మరింత బలోపేతం చేసే లక్ష్యంతోనే ఈ నియామకాలు చేపట్టినట్లు పార్టీ వర్గాలు స్పష్టం చేశాయి.

వార్తను షేర్ చేయండి:

మీ అభిప్రాయాన్ని తెలియజేయండి / Leave a Comment

మీ ఈమెయిల్ ఐడీ గోప్యంగా ఉంచబడుతుంది.

సంబంధిత వార్తలు (Related News)

శెట్టిబలిజల అభివృద్ధికి దార్శనికుడు “చంద్రన్న”: మంత్రి వాసంశెట్టి సుభాష్

శెట్టిబలిజల అభివృద్ధికి దార్శనికుడు “చంద్రన్న”: మంత్రి వాసంశెట్టి సుభాష్ అమరావతి, సెప్టెంబర్ 16: ఎక్కడ అవమానించబడ్డారో అక్కడే గౌరవం…

వైసీపీ నేతలకు ధైర్యముంటే డీఎస్సీపై ఆరోపణలు కాదు ఆధారాలు చూపండి :మంత్రి కొల్లు రవీంద్ర 

రాష్ట్రంలోని ప్రభుత్వ ఉపాధ్యాయుల్లో 90 శాతం టీడీపీ హయాంలో నియమితులైనవారే ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు, బదిలీల్లో పారదర్శకతకు బీజం…

పాలకొల్లు శ్రీ ఏ ఎస్ ఎన్ ఎం ప్రభుత్వ స్వయం ప్రతిపత్తి కళాశాలలో దివీస్ లాబొరేటరీస్ క్యాంపస్ డ్రైవ్

పాలకొల్లు శ్రీ ఏ ఎస్ ఎన్ ఎం ప్రభుత్వ స్వయం ప్రతిపత్తి కళాశాలలో దివీస్ లాబొరేటరీస్ క్యాంపస్ డ్రైవ్…