✨ ఏఐ ముఖ్యాంశాలు (AI Key Bullets)
  • ఈ వార్తకు సంబంధించిన అత్యంత ముఖ్యమైన తాజా సమాచారం.
  • ప్రభుత్వం మరియు అధికారుల నుంచి వచ్చిన అధికారిక ప్రకటనలు.
  • ప్రజలు తెలుసుకోవాల్సిన ముఖ్యాంశాలు మరియు తదుపరి పరిణామాలు.

పాలకొల్లు శ్రీ ఏ ఎస్ ఎన్ ఎం ప్రభుత్వ స్వయం ప్రతిపత్తి కళాశాలలో దివీస్ లాబొరేటరీస్ క్యాంపస్ డ్రైవ్

పాలకొల్లు, సెప్టెంబర్ 16(నిఘా ప్రతినిధి) : శ్రీ ఏ ఎస్ ఎన్ ఎం ప్రభుత్వ కళాశాల (స్వయంప్రతిపత్తి), పాలకొల్లు నందు జవహర్ నాలెడ్జ్ సెంటర్ – ప్లేస్‌మెంట్ సెల్ ఆధ్వర్యంలో దివిస్ లాబొరేటరీస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు సంబంధించిన క్యాంపస్ డ్రైవ్‌ను బుధవారం విజయవంతంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డా కె రత్నమాణిక్యం మాట్లాడుతూ, విద్యార్థులు తమ విద్యార్హతలకు అనుగుణంగా లభిస్తున్న ఉద్యోగ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో కేవలం విద్యార్హతలు మాత్రమే కాకుండా, సాంకేతిక పరిజ్ఞానం, కమ్యూనికేషన్ నైపుణ్యాలు, సమస్య పరిష్కార సామర్థ్యం, టీమ్ వర్క్ మరియు వృత్తిపరమైన నైపుణ్యాలు ఎంతో అవసరమని పేర్కొన్నారు.ప్రముఖ సంస్థల్లో ఉద్యోగం పొందడం విద్యార్థుల కెరీర్‌కు మంచి ప్రారంభమని, అయితే ఉద్యోగంలో చేరిన తరువాత కూడా నిరంతరం కొత్త విషయాలను నేర్చుకుంటూ తమ నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవాలని ప్రిన్సిపాల్ సూచించారు. కళాశాలలో అందిస్తున్న జె కె సి మరియు ప్లేస్‌మెంట్ సేవలను విద్యార్థులు సద్వినియోగం చేసుకొని, తమ ప్రతిభను నిరూపించుకోవాలని ఆకాంక్షించారు. ఎంపికైన విద్యార్థులకు అభినందనలు తెలియజేస్తూ, భవిష్యత్తులో వారు ఉన్నత స్థాయికి ఎదిగి కళాశాలకు మంచి పేరు తీసుకురావాలని కోరారు.

దివిస్ లాబొరేటరీస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు చెందిన హెచ్ ఆర్ శ్రీ రాజేష్ సంస్థ కార్యకలాపాలు, ఉద్యోగ అవకాశాలు, నియామక ప్రక్రియ, ఉద్యోగ బాధ్యతలు మరియు సంస్థలో ఉన్న కెరీర్ అవకాశాల గురించి అభ్యర్థులకు వివరించారు. అనంతరం వివిధ దశల్లో ఎంపిక ప్రక్రియను నిర్వహించారు.ఈ క్యాంపస్ డ్రైవ్‌లో సుమారు 63 మంది విద్యార్థులు పాల్గొనగా, వివిధ దశల ఎంపిక ప్రక్రియ అనంతరం 41 మంది విద్యార్థులు ఉద్యోగాలకు ఎంపికయ్యారు. ఎంపికైన విద్యార్థులను కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపకులు మరియు సిబ్బంది అభినందించారు.

ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ శ్రీ టి. కృష్ణ, ఐ క్యూ ఏ సి కోఆర్డినేటర్ డా బూసి వెంకటస్వామి, అకడమిక్ కోఆర్డినేటర్ శ్రీమతి జి సుమలత, జె కె సి కోఆర్డినేటర్ శ్రీ కె శామ్యూల్, డాక్టర్ ఎం రామకృష్ణ,శ్రీ జి డి శ్రీనివాస్, శ్రీమతి ఎం ఎల్ డి శిరీష, డా వి డి వి విజయ లక్ష్మి, డీ మన్మధరావు తదితరులు పాల్గొని విద్యార్థులను అభినందించారు.

కళాశాల యాజమాన్యం తరపున దివిస్ లాబొరేటరీస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో జె కె సి – ప్లేస్‌మెంట్ సెల్ చేస్తున్న కృషిని అభినందించారు.

వార్తను షేర్ చేయండి:

మీ అభిప్రాయాన్ని తెలియజేయండి / Leave a Comment

మీ ఈమెయిల్ ఐడీ గోప్యంగా ఉంచబడుతుంది.

సంబంధిత వార్తలు (Related News)

శెట్టిబలిజల అభివృద్ధికి దార్శనికుడు “చంద్రన్న”: మంత్రి వాసంశెట్టి సుభాష్

శెట్టిబలిజల అభివృద్ధికి దార్శనికుడు “చంద్రన్న”: మంత్రి వాసంశెట్టి సుభాష్ అమరావతి, సెప్టెంబర్ 16: ఎక్కడ అవమానించబడ్డారో అక్కడే గౌరవం…

వైసీపీ నేతలకు ధైర్యముంటే డీఎస్సీపై ఆరోపణలు కాదు ఆధారాలు చూపండి :మంత్రి కొల్లు రవీంద్ర 

రాష్ట్రంలోని ప్రభుత్వ ఉపాధ్యాయుల్లో 90 శాతం టీడీపీ హయాంలో నియమితులైనవారే ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు, బదిలీల్లో పారదర్శకతకు బీజం…

పోలవరం జలాలతో ఉత్తరాంధ్రకు మరింత అభివృద్ధి.. పరిశ్రమలతో స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు

చోడవరం నియోజకవర్గంలో అభివృద్ధికి పెద్దపీట ఒక్కరోజే దాదాపు రూ.38 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శ్రీకారం పలు రోడ్లకు…