బాపట్ల కు మరొక వరం: ఎమ్మెల్యే నరేంద్ర వర్మ రాజు
•మౌలిక వసతుల పథకాలకు
29 కోట్ల నిధుల మంజూరు
బాపట్ల, సెప్టెంబర్ 21,(గ్రేటర్ టుడే):అభివృద్ధి పద్రాన బాపట్ల పురపాలక సంఘం అద్భుతంగా ఆవిష్కృతం కాబోతుంది. పట్టణ మౌలిక వసతుల అభివృద్ధి పథకం కింద ఈ పట్టణానికి 29 కోట్ల రూపాయల నిధులు మంజూరైనట్లు శాసనసభ్యులు వేగేశననరేంద్ర వర్మ రాజు వెల్లడించారు. ఈనెల 22వ తేదీ న కుప్పంలో జరిగే కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వర్చువల్ లో రాష్ట్రవ్యాప్తంగా ఈ ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టబోతున్నారు. బాపట్ల పురపాలక సంఘ కార్యాలయం లో జరిగే కార్యక్రమంలో ఎమ్మెల్యే నరేంద్ర వర్మ పాల్గొంటారు. ఇటీవల అమృత్ పథకం కింద 22 కోట్ల రూపాయలు ఈ పురపాలక సంఘానికి మంజూరు చేయడం జరిగింది. తాజాగా మౌలిక వసతుల అభివృద్ధి పథకం కింద మరో 29 కోట్ల రూపాయలు మంజూరు కాబోతున్నాయి. మొత్తంగా 50 కోట్ల రూపాయల పైచిలుకు ఈ ఏడాది బాపట్ల పురపాలక సంఘానికి నిధులు సమకూరాయి. మున్సిపల్ మౌలిక వసతుల అభివృద్ధి పథకం కింద మంజూరైన రూ.29 కోట్లతో బాపట్ల పట్టణంలో పలు కీలక మౌలిక వసతుల పనులు చేపట్టేందుకు ప్రణాళిక రూపొందించారు. ప్రధానంగా రోడ్ల అభివృద్ధి, వీధి దీపాలు, పార్కుల అభివృద్ధి వంటి పనులకు ఈ నిధులను వినియోగించనున్నారు.