✨ ఏఐ ముఖ్యాంశాలు (AI Key Bullets)
  • ఈ వార్తకు సంబంధించిన అత్యంత ముఖ్యమైన తాజా సమాచారం.
  • ప్రభుత్వం మరియు అధికారుల నుంచి వచ్చిన అధికారిక ప్రకటనలు.
  • ప్రజలు తెలుసుకోవాల్సిన ముఖ్యాంశాలు మరియు తదుపరి పరిణామాలు.
  • “ఇదేనా నగరాల కులస్తులకు మీరిచ్చే గౌరవం?” అని సూటిగా ప్రశ్నించిన మాజీ మంత్రి వెలంపల్లి
    నగరాల కార్పొరేషన్ చైర్మన్ నియామకం కోసం ఆమరణ దీక్ష
  • క్షీణిస్తున్న బాయన బాబ్జీ ఆరోగ్యం
  • దీక్షా శిబిరాన్ని సందర్శించి పరామర్శించిన మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు
  • న్యాయపరమైన డిమాండ్‌ను కూడా తీర్చలేని కూటమి ప్రభుత్వంపై వెలంపల్లి ఫైర్

విజయవాడ, సెప్టెంబర్ 16(నిఘా ప్రతినిధి): రాష్ట్రంలో నగరాల కమ్యూనిటీ కార్పొరేషన్‌కు వెంటనే చైర్మన్‌ను నియమించాలన్న న్యాయబద్ధమైన డిమాండ్‌తో బ్రాహ్మణ వీధిలోని నగరాల రామాలయం ఎదురుగా ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నగరాల సంఘం కార్యాలయం వద్ద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నగరాల సంఘం అధ్యక్షులు బాయన బాబ్జీ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష కొనసాగుతోంది. రోజుల తరబడి ఆహార పానీయాలు విసర్జించి నిరసన తెలుపుతుండటంతో ఆయన ఆరోగ్యం క్రమంగా క్షీణిస్తోంది. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పశ్చిమ నియోజకవర్గ ఇంచార్జ్ వెలంపల్లి శ్రీనివాసరావు దీక్షా శిబిరాన్ని సందర్శించి బాబ్జీ గారిని పరామర్శించారు. ఆయన ఆరోగ్య స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నప్పటికీ, రోజురోజుకూ బలం క్షీణిస్తుండటం పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. బాబ్జీ గారి ప్రాణాలకు ముప్పు వాటిల్లకుండా చూడాల్సిన బాధ్యత ముమ్మాటికీ ప్రభుత్వానిదేనని స్పష్టం చేసారు

ఈ సందర్భంగా మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ, ప్రజలు ఎన్నుకున్న ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక వర్గానికి చట్టబద్ధంగా దక్కాల్సిన హక్కుల కోసం ఆమరణ దీక్షలు చేయాల్సి రావడం కూటమి ప్రభుత్వ అసమర్థతకు పరాకాష్ట అని మండిపడ్డారు. నగరాల కార్పొరేషన్ గత చైర్మన్ మరణించి ఏడాది గడుస్తున్నా, నూతన చైర్మన్‌ను నియమించాలన్న కనీస న్యాయపరమైన డిమాండ్‌ను కూడా తీర్చలేని దుస్థితిలో చంద్రబాబు ప్రభుత్వం ఉందని ధ్వజమెత్తారు. రోజులు గడుస్తున్నా పాలకుల్లో కనీస చలనం లేకపోవడం, దీక్షా శిబిరం వైపు కన్నెత్తి చూడకపోవడం వారి నియంతృత్వ ధోరణిని తేటతెల్లం చేస్తోందని ఫైర్ అయ్యారు.

“నగరాల కులస్తులకు మీరిచ్చే గౌరవం ఇదేనా?” అంటూ చంద్రబాబు సర్కార్‌ను వెలంపల్లి శ్రీనివాసరావు నిలదీశారు. ఎన్నికల ముందు బడుగు, బలహీన వర్గాలకు అండగా ఉంటామని కల్లబొల్లి మాటలు చెప్పి గద్దెనెక్కిన కూటమి నాయకులు, తీరా అధికారంలోకి వచ్చాక నగరాల సామాజిక వర్గాన్ని నిలువునా మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీస ప్రాతినిధ్యం కల్పించకుండా నిర్లక్ష్యం చేయడం వెన్నుపోటు రాజకీయాల్లో భాగమేనని దుయ్యబట్టారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి గారు నగరాల వర్గానికి కార్పొరేషన్ ఏర్పాటు చేసి, మేయర్, దేవస్థానాల డైరెక్టర్ల పదవులు ఇచ్చి రాజకీయంగా పెద్దపీట వేశారని గుర్తుచేశారు.

కూటమి సర్కార్ మొండివైఖరి వీడి వెంటనే స్పందించాలని, బాబ్జీ గారి ఆరోగ్య పరిస్థితి విషమించకముందే నగరాల కార్పొరేషన్‌కు చైర్మన్‌ను ప్రకటించాలని వెలంపల్లి డిమాండ్ చేశారు. బాబ్జీ గారి ప్రాణాలకు ఏమైనా జరిగితే అందుకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, కూటమి ప్రభుత్వమే ప్రత్యక్ష బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. నగరాల వర్గానికి న్యాయం జరిగే వరకు వారి వెన్నంటే ఉండి పోరాటాన్ని ఉధృతం చేస్తామని తేల్చిచెప్పారు.

ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, వైఎస్సార్‌సీపీ నాయకులు, నగరాల సంఘ ప్రతినిధులు, కుల పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

వార్తను షేర్ చేయండి:

మీ అభిప్రాయాన్ని తెలియజేయండి / Leave a Comment

మీ ఈమెయిల్ ఐడీ గోప్యంగా ఉంచబడుతుంది.

సంబంధిత వార్తలు (Related News)

శెట్టిబలిజల అభివృద్ధికి దార్శనికుడు “చంద్రన్న”: మంత్రి వాసంశెట్టి సుభాష్

శెట్టిబలిజల అభివృద్ధికి దార్శనికుడు “చంద్రన్న”: మంత్రి వాసంశెట్టి సుభాష్ అమరావతి, సెప్టెంబర్ 16: ఎక్కడ అవమానించబడ్డారో అక్కడే గౌరవం…

వైసీపీ నేతలకు ధైర్యముంటే డీఎస్సీపై ఆరోపణలు కాదు ఆధారాలు చూపండి :మంత్రి కొల్లు రవీంద్ర 

రాష్ట్రంలోని ప్రభుత్వ ఉపాధ్యాయుల్లో 90 శాతం టీడీపీ హయాంలో నియమితులైనవారే ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు, బదిలీల్లో పారదర్శకతకు బీజం…

పాలకొల్లు శ్రీ ఏ ఎస్ ఎన్ ఎం ప్రభుత్వ స్వయం ప్రతిపత్తి కళాశాలలో దివీస్ లాబొరేటరీస్ క్యాంపస్ డ్రైవ్

పాలకొల్లు శ్రీ ఏ ఎస్ ఎన్ ఎం ప్రభుత్వ స్వయం ప్రతిపత్తి కళాశాలలో దివీస్ లాబొరేటరీస్ క్యాంపస్ డ్రైవ్…