✨ ఏఐ ముఖ్యాంశాలు (AI Key Bullets)
  • ఈ వార్తకు సంబంధించిన అత్యంత ముఖ్యమైన తాజా సమాచారం.
  • ప్రభుత్వం మరియు అధికారుల నుంచి వచ్చిన అధికారిక ప్రకటనలు.
  • ప్రజలు తెలుసుకోవాల్సిన ముఖ్యాంశాలు మరియు తదుపరి పరిణామాలు.
  • రాష్ట్రంలోని ప్రభుత్వ ఉపాధ్యాయుల్లో 90 శాతం టీడీపీ హయాంలో నియమితులైనవారే
  • ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు, బదిలీల్లో పారదర్శకతకు బీజం వేసిందే చంద్రబాబు నాయుడు
  • వైసీపీ హయాంలోని ఏపీపీపీఎస్సీ స్కాం నుండి దృష్టి మరల్చేందుకే డీఎస్సీపై ఆరోపణలు
  • గుడ్డకాల్చి మొహాన పడేస్తామంటే ప్రజలు తాటతీస్తారని వైసీపీ నేతలకు మంత్రి కొల్లు రవీంద్ర వార్నింగ్

 

 

అమరావతి, సెప్టెంబరు 17 (నిఘా ప్రతినిధి):ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు, బదిలీల్లో పారదర్శకతకు బీజం వేసిందే నారా చంద్రబాబు నాయుడు అని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. ఈ మేరకు మచిలీపట్నంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేశాం. పారదర్శకంగా నియామకాలు పూర్తి చేశాం. కానీ ఏదో జరిగిపోయిదంటూ వైసీపీ నేతలు ఆరోపణలు చేయడం సిగ్గుచేటని ధ్వజమెత్తారు. ఒకప్పుడు టీచర్ల బదిలీలు జిల్లా పరిషత్ చైర్మన్లు నడిపించేవారు. ఎవరికి ఎక్కడ రాస్తే అక్కడకు బదిలీ చేసేవారు. కానీ చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చాక దేశంలోనే మొట్టమొదటిసారి కౌన్సిలింగ్ విధానం తీసుకొచ్చారు. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలను పారదర్శకంగా నిర్వహించారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగుల్లో 90 శాతం టీడీపీ హయాంలో నియమితులైనవారే. మెరిట్ ప్రకారమే నియామకాలు జరగాలనే సిద్ధాంతంతో పని చేశాం. వైసీపీ ఐదేళ్ల పాలనలో ప్రభుత్వ ఉద్యోగుల్ని జలగల్లా పీడించారు. ఉపాధ్యాయుల్ని మద్యం షాపుల ముందు కాపలా పెట్టారు. మరుగుదొడ్లు కడిగించి ఫోటోలు తీయించారు. కానీ నేడు ఉపాధ్యాయులకు మెరుగైన శిక్షణ కోసం విదేశాలకు పంపిస్తున్నాం. అత్యుత్తమ విధ్యా విధానాలను అద్యయనం చేసే అవకాశం కల్పించాం.బదిలీలు కావాలంటే డబ్బు తీసుకోవడంలో తప్పేముందని బందరులోని వైసీపీ నేత నిస్సిగ్గుగా మాట్లాడుతున్నాడు. ప్రభుత్వ ఉద్యోగులు ‘గిఫ్ట్‌లు ఇస్తే తప్పేముంది, ఉద్యోగస్తులు గిఫ్ట్‌లు తీసుకుంటే తప్పేముందని సిగ్గులేకుండా మాట్లాడుతున్నాడు. వాళ్లు అసలు మనుషులేనా? కూటమి ప్రభుత్వంలో అత్యంత పారదర్శకంగా ఉద్యోగ బదిలీలు జరిగాయి. నియామకాలు జరిగాయి. యువత జీవితాలు నాశనం చేసేలా వైసీపీ నేతలు వ్యవహరిస్తున్నారు. నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా చేపట్టిన సంస్కరణల వల్ల 19వ స్థానంలో ఉన్న రాష్ట్ర విద్యా రంగం ప్రస్తుతం అగ్రస్థానానికి చేరింది.   ఎయిడెడ్ స్కూల్స్‌ అన్నింటిని దోచుకోవాలని వైసీపీ నేతలు ప్రయత్నిస్తే.. నేడు స్కూల్స్ అన్నింటినీ ఆదర్శంగా తీర్చిదిద్దుతున్నాం. పేరెంట్స్‌ టీచర్ కమిటీలు ఏర్పాటు చేశాం. నాలెడ్జ్ స్టేట్‌గా ఏపీని మార్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేస్తున్నారు.  బీసీ హాస్టల్స్, రెసిడెన్షియల్స్, రెసిడెన్షియల్ స్కూల్స్‌గా, ఎస్సీ హాస్టల్స్‌ని భారతదేశంలోనే అగ్రస్థానంలో నిలిపేందుకు కృషి చేస్తున్నాం. బడుగు బలహీన వర్గాలకు ఇంటిగ్రేటెడ్ హాస్టల్స్ నిర్మాణం చేపట్టాం. రాష్ట్ర విద్యా రంగంలో జరుగుతున్న పురోగతిని నచ్చక కడుపు మంటతో ప్రభుత్వంపై నిందలేస్తున్నారు. మంచిని అడ్డుకోవాలని చూస్తే ప్రజలు ఎప్పటికీ క్షమించరనే విషయాన్ని వైసీపీ నేతలు గుర్తుంచుకోవాలని హెచ్చరించారు.డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చిన రోజు నుండి సుమారు 300కి పైగా కేసులు వేశారు. వాటన్నింటినీ పరిష్కరించుకుని నియామకాలు పూర్తి చేశాం. పేకాట ఆడినోళ్లకు ఉద్యోగాలిచ్చారని పేర్ని నాని  చెబుతున్నాడు. బ్రిడ్జ్ గేమ్‌ను కేంద్ర ప్రభుత్వం స్పోర్ట్స్ కోటాలో ఉంది. అందులో తప్పేముందో పేర్ని నాని సమాధానం చెప్పాలి. ఆ కేటగిరీలో ఎవరికైనా ఉద్యోగాలిచ్చామా? పేర్ని నానికి ఛాలెంజ్ చేస్తున్నా.. ధైర్యముంటే వచ్చి నిరూపించు. నోరుంది కదా అని… ఏది పడితే అది వాగితే ప్రజలు తోలు వలిచేయడం తధ్యం. డీఎస్సీ గురించి రోజుకో మాట మాట్లాడుతున్న జగన్ రెడ్డి.. ఏపీపీఎస్సీలో జరిగిన అక్రమాలకు సమాధానం చెప్పాలి. వైసీపీ హయాంలో జరిగిన ఏపీపీఎస్సీలో అక్రమాలను కోర్టు ఆదేశాల మేరకు సిట్ నిగ్గుతేల్చింది. అక్రమాలు వాస్తవమని కూడా కోర్టుకు నివేదించింది. ఏపీపీఎస్సీ ప్రశ్నా పత్రాలను రిసార్టులో వేల్యేయేషన్ చేసినట్లు సిట్ పేర్కొంది.

యువత జీవితాలకు మార్గం చూపే ప్రశ్నా పత్రాలను రిసార్ట్‌లో వాల్యుయేషన్ వేపిస్తారా? ఏపీపీఎస్సీలో కోట్లాది రూపాయలు దండుకున్న దుర్మార్గుడు.. డీఎస్సీపై నిందలేయడం సిగ్గుచేటు. దాదాపు 630 ఓఎంఆర్ షీట్లు రిసార్టులో ఉంచినట్లు SIT నివేదికలో ప్రస్తావించింది. సెంట్రల్ ఫోరెన్సిక్ ల్యాబ్… 736 మంది అభ్యర్థుల పరీక్షా పత్రాలతో కూడినటువంటి ఫైల్‌ని… ఈ ల్యాబ్స్‌కు పంపించడం జరిగింది. ఇది జగన్ రెడ్డి చేసిన స్కాం కాదా? 97.55% పత్రాల్లో అవకతవకలు జరిగినాయని SIT నివేదికలో పేర్కొనడం వాస్తవం కాదా? APPSCలో చేయాల్సిన ఘోరాలన్నీ చేసి..  ట్రాన్స్‌పరెంట్‌గా జరిగిన మెగా DSCపై నిందలేస్తున్నారు. ఇప్పటికే అధికారులు డీఎస్సీ గురించి స్పష్టంగా చెప్పారు. వైసీపీ ఆరోపణలన్నింటికీ సమాధానమిచ్చారు. ఇప్పటికీ మీకు అనుమానాలుంటే.. ఆధారాలతో రండి. విచారణ చేయిద్దాం. అంతేగానీ బురద జల్లేసి చేతులు కడుక్కుంటాం. గుడ్డకాల్చి మొహాన పడేద్దాం అనే ధోరణిలో వ్యవహరిస్తే ఉపేక్షించే పరిస్థితి లేదు.
కూటమి ప్రభుత్వం రెండున్నర సంవత్సరాల్లో చేసిన అభివృద్ధి, సంక్షేమం పట్ల ప్రజలు సంతోషంగా ఉన్నారు.  16th ఫైనాన్స్ కమిషన్ నిధులు సాధించుకోవడం కోసం స్థానిక ఎన్నికలు జరపాల్సిందే. ఎన్నికలు పూర్తి చేయాలని నిర్ణయించాం. ఈ వ్యవహారంపై కూడా వైసీపీ నేతలు కోర్టుకు వెళ్లారు. ఎన్నికలు జరపకుండా ఆపాలనే ప్రయత్నం చేశారు. జనాభా ప్రాతిపదికన డివిజన్ల పెంపు జరుగుతోంది. త్వరలోనే రిజర్వేషన్లు కూడా పూర్తి చేస్తాం. బీసీ రిజర్వేషన్ల విషయం కోర్టులో ఉంది. అది కూడా క్లియర్ అయిపోయిన తర్వాత ఎన్నికల షెడ్యూల్ విడుదల చేస్తాం. మచిలీపట్నం మున్సిపాలిటీలో 60 డివిజన్ల ప్రకారమే ఎన్నికలు జరుగుతాయి. ప్రజల అభిప్రాయం మేరకు ప్రజల కోసం పాలిస్తున్నాం. అలాంటి ప్రజాస్వామ్య రాష్ట్రంలో వైసీపీ లాంటి పార్టీ ఉండడం, జగన్ రెడ్డి లాంటి దుర్మార్గులు ఉండడం మన దౌర్భాగ్యం. ప్రభుత్వ వ్యవహారాలపై ఎలాంటి అనుమానాలున్నా.. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా తెచ్చుకోవచ్చు. ప్రజలకు పారదర్శకమైన పాలన అందించడం మా బాధ్యత. ఆ మాటకు ఎప్పుడూ కట్టుబడి ఉంటాం. ఎక్కడైనా అవకతవకలు గుర్తిస్తే ఫిర్యాదు చేయాలి. అవసరమైతే కోర్టుకు వెళ్లి న్యాయపోరాటం చేయాలి. అంతేగానీ.. అబద్దాలు ప్రచారం చేస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రజలు క్షమించరనే విషయాన్ని జగన్ రెడ్డి అండ్ కో గుర్తుంచుకోవాలని మంత్రి కొల్లు రవీంద్ర హెచ్చరించారు.
వార్తను షేర్ చేయండి:

మీ అభిప్రాయాన్ని తెలియజేయండి / Leave a Comment

మీ ఈమెయిల్ ఐడీ గోప్యంగా ఉంచబడుతుంది.

సంబంధిత వార్తలు (Related News)

శెట్టిబలిజల అభివృద్ధికి దార్శనికుడు “చంద్రన్న”: మంత్రి వాసంశెట్టి సుభాష్

శెట్టిబలిజల అభివృద్ధికి దార్శనికుడు “చంద్రన్న”: మంత్రి వాసంశెట్టి సుభాష్ అమరావతి, సెప్టెంబర్ 16: ఎక్కడ అవమానించబడ్డారో అక్కడే గౌరవం…

పాలకొల్లు శ్రీ ఏ ఎస్ ఎన్ ఎం ప్రభుత్వ స్వయం ప్రతిపత్తి కళాశాలలో దివీస్ లాబొరేటరీస్ క్యాంపస్ డ్రైవ్

పాలకొల్లు శ్రీ ఏ ఎస్ ఎన్ ఎం ప్రభుత్వ స్వయం ప్రతిపత్తి కళాశాలలో దివీస్ లాబొరేటరీస్ క్యాంపస్ డ్రైవ్…

పోలవరం జలాలతో ఉత్తరాంధ్రకు మరింత అభివృద్ధి.. పరిశ్రమలతో స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు

చోడవరం నియోజకవర్గంలో అభివృద్ధికి పెద్దపీట ఒక్కరోజే దాదాపు రూ.38 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శ్రీకారం పలు రోడ్లకు…