ఘనంగా ప్రారంభమైన ‘3 ఫ్లవర్స్’ ద్విభాషా చిత్రం
హైదరాబాద్, సెప్టెంబర్ 11 (నిఘా ప్రతినిధి): ‘వైజాగ్ ఫ్రెండ్స్ టీమ్’ నిర్మిస్తున్న నూతన చిత్రం ‘3 ఫ్లవర్స్’. తెలుగు, హిందీ భాషల్లో ఒకేసారి తెరకెక్కుతున్న ఈ సినిమా ముహూర్తపు వేడుక హైదరాబాద్లోని సినీ కార్యాలయంలో చిత్రబృందం, సినీ ప్రముఖుల సమక్షంలో అత్యంత ఘనంగా జరిగింది. ఈ చిత్రంలో నూపూర్ ముఖర్జీ, ఆదితి, పద్మ కథానాయికలుగా నటిస్తుండగా.. అజయ్ ఘోష్, కాలకేయ ప్రభాకర్, జబర్దస్త్ చలాకీ చంటి కీలక పాత్రల్లో అలరించనున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు అజయ్ ఏజే మాట్లాడుతూ “కథ, స్క్రీన్ప్లే సరికొత్తగా ఉంటాయని, ముగ్గురు కథానాయికల చుట్టూ తిరిగే ఈ డ్రామా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుందన్నారు. సీనియర్ నటుల సహకారంతో త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తాం” అని తెలిపారు. ఈ చిత్రానికి కథ, స్క్రీన్ప్లే, దర్శకత్వం : అజయ్ ఏజే, సినిమాటోగ్రఫీ : మను, నిర్మాణం : వైజాగ్ ఫ్రెండ్స్ టీమ్, ప్రధాన నటీనటులు : నూపూర్ ముఖర్జీ, ఆదితి, పద్మ, అజయ్ ఘోష్, కాలకేయ ప్రభాకర్, జబర్దస్త్ చలాకీ చంటి తదితరులు నటిస్తున్నట్లు దర్శకుడు తెలిపారు.