బిజినెస్ ఎక్స్‌పోను సందర్శించిన హోం మంత్రి అనిత
విశాఖపట్నం, సెప్టెంబర్ 13: ఏపీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఫెడరేషన్ ఆధ్వర్యంలో విశాఖపట్నంలోని గదిరాజు ప్యాలెస్‌లో నిర్వహిస్తున్న బిజినెస్ ఎక్స్‌పో–2026ను రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత మూడో రోజు సందర్శించారు. ఈ సందర్భంగా బిజినెస్ ఎక్స్‌పోలో ఏర్పాటు చేసిన వివిధ స్టాల్స్‌ను హోం మంత్రి అనిత పరిశీలించారు. ఎక్స్‌పోకు విచ్చేసిన హోం మంత్రి అనితకు ఏపీ ఛాంబర్స్ ప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఛాంబర్స్ ప్రతినిధులు హోం మంత్రి అనితకు ఎక్స్‌పోలో ఏర్పాటు చేసిన వివిధ స్టాల్స్‌ను చూపిస్తూ, ఆయా సంస్థలు, ఉత్పత్తులు, సేవలకు సంబంధించిన వివరాలను వివరించారు. స్టాల్స్‌ను ఆసక్తిగా పరిశీలించిన హోం మంత్రి.. వ్యాపార, పారిశ్రామిక రంగాల అభివృద్ధి, మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు ఇలాంటి ఎక్స్‌పోలు ఎంతగానో దోహదపడతాయని పేర్కొన్నారు. బిజినెస్ ఎక్స్‌పోలో వివిధ రంగాలకు చెందిన వ్యాపార, పారిశ్రామిక సంస్థలు పాల్గొని తమ ఉత్పత్తులు, సేవలను ప్రదర్శిస్తున్నాయి.మంత్రి కొండపల్లి శ్రీనివాస్, విశాఖపట్నం జిల్లా కలెక్టర్ అభిషిక్త్ కిశోర్ కార్యక్రమంలో ఏపీ ఛాంబర్స్ ప్రతినిధులు, నిర్వాహకులు, పారిశ్రామికవేత్తలు తదితరులు పాల్గొన్నారు.