✨ ఏఐ ముఖ్యాంశాలు (AI Key Bullets)
  • ఏపీ అభివృద్ధిలో పారిశ్రామికవేత్తలు భాగస్వామ్యులు కావాలి :మంత్రి కందుల దుర్గేష్
  • Entrepreneurs Must Partner in AP's Development: Minister Kandula Durgesh
  • उद्योगपतियों को आंध्र प्रदेश के विकास में भागीदार बनना चाहिए: मंत्री कंदुला दुर्गेश
  • విశాఖ వేదికగా నిర్వహిస్తోన్న ఏపీ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఫెడరేషన్ ఎంఎస్ఎంఈ బిజినెస్ ఎక్స్ పో-2026 ప్రారంభంలో మంత్రి కందుల దుర్గేష్ కీలక ప్రసంగం
  • ముఖ్య అతిథులుగా పాల్గొన్న పర్యాటక మంత్రి కందుల దుర్గేష్, విశాఖ ఎంపీ శ్రీభరత్
  • మంత్రి దుర్గేష్ నేతృత్వంలో పర్యాటక రంగం శరవేగంగా వృద్ధి చెందుతోందని విశాఖ ఎంపీ శ్రీభరత్ ప్రశంస
  • “ఔత్సాహిక పారిశ్రామికవేత్తల ఆలోచనలకు రూపమిచ్చి, వారి వ్యాపార కలలను సాకారం చేసే మార్గదర్శక వేదికే ఈ ఎంఎస్ఎంఈ ఎక్స్ పో..ఈ సందర్భంగా నిర్వాహకులను అభినందించిన తెలిపిన మంత్రి దుర్గేష్”
  • రూ. 500 కోట్లతో విశ్వవ్యాప్త పర్యాటక గమ్యస్థానాలుగా ‘తిరుపతి, విశాఖ’:మంత్రి కందుల దుర్గేష్

విశాఖపట్నం,సెప్టెంబర్ 11(నిఘా ప్రతినిధి): టూరిజంలో ఇన్వెస్ట్ చేయండి .. లాభసాటి భవిష్యత్తును సొంతం చేసుకోండి అని మంత్రి కందుల దుర్గేష్ పిలుపునిచ్చారు.విశాఖపట్నంలోని గాదిరాజు ప్యాలెస్‌లో ‘ఏపీ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ ఫెడరేషన్’ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన “ఎంఎస్ఎంఈ బిజినెస్ ఎక్స్ పో-2026” కు మంత్రి కందుల దుర్గేష్, విశాఖ ఎంపీ శ్రీభరత్ ముఖ్య అతిథులుగా హాజరై, జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా పారిశ్రామికవేత్తలు, ఔత్సాహిక ప్రతినిధులను ఉద్దేశించి మంత్రి దుర్గేష్ ప్రసంగిస్తూ— “భారతదేశంలో ఉండే అద్భుతాలన్నీ ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే కొలువుదీరి ఉన్నాయంటే ఏమాత్రం అతిశయోక్తి లేదు” అని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యకు సభలో ఉన్న ప్రతినిధుల నుండి విశేష స్పందన లభించింది.రాష్ట్ర పర్యాటకాభివృద్ధిలో భాగంగా కనెక్టివిటీ, సర్క్యూట్ క్రియేషన్, కెపాసిటీ బిల్డింగ్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, డిస్ట్రిబ్యూషన్ అనే అంశాలకు ప్రాధాన్యత ఇస్తున్నామని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ కీలకోపన్యాసం చేశారు.ఏపీని గ్లోబల్ టూరిజం డెస్టినేషన్‌గా తీర్చిదిద్దే ప్రక్రియలో ‘ఏపీ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఫెడరేషన్’ భాగస్వామ్యం కావాలని మంత్రి దుర్గేష్ పిలుపునిచ్చారు.ఎంఎస్ఎంఈ ఎక్స్ పో అనేది యువత తమ నూతన ఆలోచనలను, ఉత్పత్తులను ప్రాక్టికల్‌గా ప్రపంచానికి పరిచయం చేసే గొప్ప సదవకాశమన్నారు.పారిశ్రామిక రంగంలో ఉన్న అనుభవజ్ఞులు, పెట్టుబడిదారులు,సరఫరాదారులతో నేరుగా కనెక్ట్ అయ్యే అరుదైన అవకాశం ఈ ఎక్స్ పో కల్పిస్తుందని తెలిపారు.ప్రస్తుత పరిశ్రమ తీరుతెన్నులు, వినియోగదారుల అవసరాలు, ఆధునిక సాంకేతికతపై ఔత్సాహిక వ్యాపారులకు స్పష్టమైన అవగాహన లభిస్తుందని వెల్లడించారు.తమ స్టార్టప్, వ్యాపార ఆలోచనలకు అవసరమైన ఆర్థిక సహకారం, క్రెడిట్ సపోర్ట్ , ఇన్వెస్టర్లను ఆకర్షించేందుకు ఇది సరైన మార్గమని ఎక్స్ పో నిర్వహించిన నిర్వాహకులను అభినందించారు. ఈ ఎక్స్ పో ద్వారా అనుభవజ్ఞులైన సీనియర్ పారిశ్రామికవేత్తల అనుభవాలను తెలుసుకోవడం ద్వారా వ్యాపారంలో వచ్చే సవాళ్లను ఎదుర్కొనే ధైర్యం, దిశానిర్దేశం లభిస్తాయని పేర్కొన్నారు.

ప్రస్తుతం పర్యాటక రంగం అత్యధిక ఉపాధి అవకాశాలను సృష్టిస్తోందని, అత్యంత లాభసాటి వ్యాపార రంగంగా మారిందని మంత్రి దుర్గేష్ తెలిపారు. సెప్టెంబర్ 27న రాజమహేంద్రవరంలో ఘనంగా నిర్వహించనున్న ‘ప్రపంచ పర్యాటక దినోత్సవం’ వేదికగా ఏపీని అంతర్జాతీయ టూరిజం హబ్‌గా మార్చేందుకు సమగ్ర కార్యాచరణను సిద్ధం చేయనున్నామన్నారు. ఆ కార్యక్రమానికి విచ్చేసి పర్యాటక శాఖతో భాగస్వామ్యం అవ్వాలని కోరారు. కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన పర్యాటక విధానం 2024-29తో తో రంగానికి కొత్త ఊపిరి వచ్చిందని, పర్యాటక రంగానికి ‘పారిశ్రామిక హోదా’ కల్పించడంతో భారీగా ఇన్వెస్టర్లు ముందుకు వస్తున్నారని తెలిపారు.తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం తదితర ప్రాంతాల్లో పెట్టుబడులు పెట్టేందుకు పలు ప్రముఖ సంస్థలు ఆసక్తి చూపుతున్నాయని, వారికి ప్రభుత్వం తరఫున ప్రత్యేక రాయితీలు ఇస్తున్నామని వెల్లడించారు.

ఇన్-బౌండ్ టూరిజం పెరుగుదలే లక్ష్యంగా అడ్వెంచర్, ఎకో, వెల్ నెస్, క్రూయిజ్ పర్యాటక రంగాంశాలను శరవేగంగా అభివృద్ధి చేస్తున్నామని మంత్రి దుర్గేష్ వివరించారు. 2019-24 ఐదేళ్ల కాలంలో రాష్ట్రంలో పర్యాటక రంగం తీవ్రంగా కుదేలైందని, ఒక్క ప్రాజెక్టు కూడా రాలేదని విమర్శించిన మంత్రి దుర్గేష్ ప్రస్తుత పాలసీ ద్వారా థీమ్ పార్కులు, అమ్యూజ్‌మెంట్ పార్కులు, మౌలిక సదుపాయాలు, ఎకో పార్కుల ఏర్పాటుకు వేగంగా శ్రీకారం చుట్టామన్నారు.

రాబోయే ప్రతిష్టాత్మక ‘గోదావరి పుష్కరాలు’ దృష్ట్యా దాదాపు 10 నుండి 15 కోట్ల మంది భక్తులు రాష్ట్రానికి విచ్చేస్తారని అంచనా వేస్తున్నట్లు మంత్రి దుర్గేష్ తెలిపారు.భక్తుల వసతి కోసం నదీ తీర ప్రాంతాలు, క్షేత్రాల్లో ‘టెంట్ సిటీలు’ ‘హోమ్ స్టేలు’, విస్తృత స్థాయిలో హోటల్ రూమ్‌లను సిద్ధం చేస్తున్నామన్నారు. పుష్కరాలు జరిగే 6 జిల్లాల్లో అప్రోచ్ రోడ్లు, ఏటిగట్టుల పటిష్టత, అభివృద్ధి పనులను వేగవంతం చేశామన్నారు.ఆధ్యాత్మిక వాతావరణంతో పాటు పర్యాటకులకు అనుభూతినిచ్చే ప్రత్యేక ఆధ్యాత్మిక టూర్ ప్యాకేజీలను రూపొందిస్తున్నామని స్పష్టం చేశారు.తిరుమల, అన్నవరం, శ్రీశైలం, అహోబిలం, గండికోట, సూర్యలంక, విశాఖ బీచ్‌లు, మారేడుమిల్లి, అరకు, బొర్రా గుహలు తదితర ప్రాంతాలను అనుసంధానిస్తున్నామన్నారు.

కూచిపూడి నృత్యాన్ని విశ్వవ్యాప్తం చేయడంతో పాటు ఏటికొప్పాక బొమ్మలు, కొండపల్లి బొమ్మలు, శ్రీకాళహస్తి కళంకారీ, ఉప్పాడ, ధర్మవరం, మంగళగిరి చేనేత వస్త్రాలకు అంతర్జాతీయ గుర్తింపు తెచ్చేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఆంధ్రా ప్రత్యేక వంటకాలను ప్రపంచ పర్యాటకులకు రుచి చూపించేలా కలినరీ టూరిజానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నట్లు వివరించారు.

ఈ సందర్భంగా రాష్ట్రంలో క్రీడా పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు అనంతపురం, అరకు, గండికోట ప్రాంతాల్లో గ్లోబల్ గోల్ఫ్ కోర్సులు ఏర్పాటు చేసేందుకు పలువురు ఇన్వెస్టర్లు సుముఖంగా ఉన్నామని ఇన్వెస్టర్లు తెలిపారు.

దేశవ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా అభివృద్ధి చేయనున్న 50 ప్రధాన పర్యాటక గమ్యస్థానాల జాబితాలో ఆంధ్రప్రదేశ్ నుండి ‘తిరుపతి, విశాఖపట్నం’ నగరం ఎంపికయ్యాయి. ఈ రెండు ప్రధాన పర్యాటక కేంద్రాలను ఏకంగా రూ. 500 కోట్ల వ్యయంతో అత్యున్నత ప్రమాణాలతో తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. సాధారణంగా ప్రతి రాష్ట్రానికి ఒక పర్యాటక ప్రాంతానికే అనుమతి లభించే పరిస్థితి ఉన్నప్పటికీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ల ప్రత్యేక చొరవ, వ్యూహాత్మక కృషి కారణంగానే రాష్ట్రానికి రెండు ప్రాజెక్టులు దక్కాయని సంతోషం వ్యక్తం చేశారు. తద్వారా దేశీయ, విదేశీ పర్యాటకులకు మెరుగైన సదుపాయాలు, కొత్త అనుభవాలు, భద్రత, ఆహార సదుపాయాలు , డిజిటల్ సేవలన్నీ ఒకచోట సమగ్ర ప్యాకేజీగా అందించేందుకు వీలుపడుతుందన్నారు.

ప్రధాని నరేంద్ర మోదీ ‘వికసిత్ భారత్ 2047’, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ‘వికసిత్ ఆంధ్రప్రదేశ్ 2047’ విజన్ కు అనుగుణంగా అందరం కలిసికట్టుగా పనిచేసి రాష్ట్రాన్ని ప్రగతిపథంలో నిలుపుదామని మంత్రి దుర్గేష్ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.

మంత్రి దుర్గేష్ నేతృత్వంలో పర్యాటక రంగం పరుగులు: విశాఖ ఎంపీ శ్రీభరత్

కార్యక్రమంలో పాల్గొన్న విశాఖపట్నం పార్లమెంట్ సభ్యులు శ్రీభరత్ మాట్లాడుతూ.. రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ నేతృత్వంలో ఏపీ పర్యాటక రంగం పరుగులు పెడుతోందని కొనియాడారు. ప్రభుత్వ ఆలోచనలను మైదాన ప్రాంతాల్లో అమలు చేయడంలో, పెట్టుబడులను గ్రౌండింగ్ చేయడంలో మంత్రి దుర్గేష్ అత్యంత సమర్థుడని ప్రశంసించారు. ఈ ఎంఎస్ఎంఈ ఎక్స్ పో యువతకు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తల ఇన్నోవేషన్ ఐడియాలకు గొప్ప వేదికగా నిలుస్తుందన్నారు.విశాఖను గ్లోబల్ టూరిజంగా తీర్చిదిద్దుతామన్నారు.

ఈ కార్యక్రమంలో పర్యాటక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎస్.ఎస్. రావత్, ఏపీ ఛాంబర్స్ విశాఖ ప్రతినిధి శోభన్ ప్రకాష్, ప్రతినిధులు త్రినాథ్, రామకృష్ణ, మల్లిఖార్జునరావు, లక్ష్మీనారాయణ, భాస్కర్, హోటల్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఆర్. స్వామి, వివిధ రంగాల ప్రతినిధులు, భారీ సంఖ్యలో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు.

వార్తను షేర్ చేయండి:

మీ అభిప్రాయాన్ని తెలియజేయండి / Leave a Comment

మీ ఈమెయిల్ ఐడీ గోప్యంగా ఉంచబడుతుంది.

సంబంధిత వార్తలు (Related News)

శెట్టిబలిజల అభివృద్ధికి దార్శనికుడు “చంద్రన్న”: మంత్రి వాసంశెట్టి సుభాష్

శెట్టిబలిజల అభివృద్ధికి దార్శనికుడు “చంద్రన్న”: మంత్రి వాసంశెట్టి సుభాష్ అమరావతి, సెప్టెంబర్ 16: ఎక్కడ అవమానించబడ్డారో అక్కడే గౌరవం…

వైసీపీ నేతలకు ధైర్యముంటే డీఎస్సీపై ఆరోపణలు కాదు ఆధారాలు చూపండి :మంత్రి కొల్లు రవీంద్ర 

రాష్ట్రంలోని ప్రభుత్వ ఉపాధ్యాయుల్లో 90 శాతం టీడీపీ హయాంలో నియమితులైనవారే ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు, బదిలీల్లో పారదర్శకతకు బీజం…

పాలకొల్లు శ్రీ ఏ ఎస్ ఎన్ ఎం ప్రభుత్వ స్వయం ప్రతిపత్తి కళాశాలలో దివీస్ లాబొరేటరీస్ క్యాంపస్ డ్రైవ్

పాలకొల్లు శ్రీ ఏ ఎస్ ఎన్ ఎం ప్రభుత్వ స్వయం ప్రతిపత్తి కళాశాలలో దివీస్ లాబొరేటరీస్ క్యాంపస్ డ్రైవ్…