✨ ఏఐ ముఖ్యాంశాలు (AI Key Bullets)
  • ఈ వార్తకు సంబంధించిన అత్యంత ముఖ్యమైన తాజా సమాచారం.
  • ప్రభుత్వం మరియు అధికారుల నుంచి వచ్చిన అధికారిక ప్రకటనలు.
  • ప్రజలు తెలుసుకోవాల్సిన ముఖ్యాంశాలు మరియు తదుపరి పరిణామాలు.

బాపట్ల కు మరొక వరం: ఎమ్మెల్యే నరేంద్ర వర్మ రాజు

 

•మౌలిక వసతుల పథకాలకు
29 కోట్ల నిధుల మంజూరు

బాపట్ల, సెప్టెంబర్ 21,(గ్రేటర్ టుడే):అభివృద్ధి పద్రాన బాపట్ల పురపాలక సంఘం అద్భుతంగా ఆవిష్కృతం కాబోతుంది. పట్టణ మౌలిక వసతుల అభివృద్ధి పథకం కింద ఈ పట్టణానికి 29 కోట్ల రూపాయల నిధులు మంజూరైనట్లు శాసనసభ్యులు వేగేశననరేంద్ర వర్మ రాజు వెల్లడించారు. ఈనెల 22వ తేదీ న కుప్పంలో జరిగే కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వర్చువల్ లో రాష్ట్రవ్యాప్తంగా ఈ ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టబోతున్నారు. బాపట్ల పురపాలక సంఘ కార్యాలయం లో జరిగే కార్యక్రమంలో ఎమ్మెల్యే నరేంద్ర వర్మ పాల్గొంటారు. ఇటీవల అమృత్ పథకం కింద 22 కోట్ల రూపాయలు ఈ పురపాలక సంఘానికి మంజూరు చేయడం జరిగింది. తాజాగా మౌలిక వసతుల అభివృద్ధి పథకం కింద మరో 29 కోట్ల రూపాయలు మంజూరు కాబోతున్నాయి. మొత్తంగా 50 కోట్ల రూపాయల పైచిలుకు ఈ ఏడాది బాపట్ల పురపాలక సంఘానికి నిధులు సమకూరాయి. మున్సిపల్‌ మౌలిక వసతుల అభివృద్ధి పథకం కింద మంజూరైన రూ.29 కోట్లతో బాపట్ల పట్టణంలో పలు కీలక మౌలిక వసతుల పనులు చేపట్టేందుకు ప్రణాళిక రూపొందించారు. ప్రధానంగా రోడ్ల అభివృద్ధి, వీధి దీపాలు, పార్కుల అభివృద్ధి వంటి పనులకు ఈ నిధులను వినియోగించనున్నారు.

వార్తను షేర్ చేయండి:

మీ అభిప్రాయాన్ని తెలియజేయండి / Leave a Comment

మీ ఈమెయిల్ ఐడీ గోప్యంగా ఉంచబడుతుంది.

సంబంధిత వార్తలు (Related News)

శెట్టిబలిజల అభివృద్ధికి దార్శనికుడు “చంద్రన్న”: మంత్రి వాసంశెట్టి సుభాష్

శెట్టిబలిజల అభివృద్ధికి దార్శనికుడు “చంద్రన్న”: మంత్రి వాసంశెట్టి సుభాష్ అమరావతి, సెప్టెంబర్ 16: ఎక్కడ అవమానించబడ్డారో అక్కడే గౌరవం…

వైసీపీ నేతలకు ధైర్యముంటే డీఎస్సీపై ఆరోపణలు కాదు ఆధారాలు చూపండి :మంత్రి కొల్లు రవీంద్ర 

రాష్ట్రంలోని ప్రభుత్వ ఉపాధ్యాయుల్లో 90 శాతం టీడీపీ హయాంలో నియమితులైనవారే ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు, బదిలీల్లో పారదర్శకతకు బీజం…

పాలకొల్లు శ్రీ ఏ ఎస్ ఎన్ ఎం ప్రభుత్వ స్వయం ప్రతిపత్తి కళాశాలలో దివీస్ లాబొరేటరీస్ క్యాంపస్ డ్రైవ్

పాలకొల్లు శ్రీ ఏ ఎస్ ఎన్ ఎం ప్రభుత్వ స్వయం ప్రతిపత్తి కళాశాలలో దివీస్ లాబొరేటరీస్ క్యాంపస్ డ్రైవ్…

పోలవరం జలాలతో ఉత్తరాంధ్రకు మరింత అభివృద్ధి.. పరిశ్రమలతో స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు

చోడవరం నియోజకవర్గంలో అభివృద్ధికి పెద్దపీట ఒక్కరోజే దాదాపు రూ.38 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శ్రీకారం పలు రోడ్లకు…