శెట్టిబలిజల అభివృద్ధికి దార్శనికుడు “చంద్రన్న”: మంత్రి వాసంశెట్టి సుభాష్
అమరావతి, సెప్టెంబర్ 16: ఎక్కడ అవమానించబడ్డారో అక్కడే గౌరవం పొందడం” అనేది జీవితంలో అత్యంత గొప్ప విజయంగా అభివర్ణించవచ్చు. ఒక సామాజిక వర్గాన్ని తక్కువ చేసి మాట్లాడడం, అవమానించిన వ్యక్తుల ముందే మన ప్రతిభతో, కష్టపడే తత్వంతో ఉన్నత స్థానానికి ఎదగడం సామాన్యమైన విషయం కాదు.
ఒక జాతిని అవమానించిన వారిపై గొడవపడటం లేదా కక్ష సాధించడం కంటే, మన ఎదుగుదల ద్వారా వారికి సమాధానం చెప్పడమే అత్యుత్తమ ప్రతీకారమని చెప్పాలి.
అవమానాలు ఎదురైనప్పుడు కుంగిపోకుండా, వాటినే పెట్టుబడిగా మార్చుకుని కష్టపడితే ఒకరోజు ఖచ్చితంగా అదే స్థానంలో మనకు గౌరవం దక్కుతుంది.
ఈ సూత్రం రాష్ట్రంలోని శెట్టి బలిజ సామాజిక వర్గానికి వర్తిస్తుంది. గత వైసీపీ ప్రభుత్వ విధ్వంసక పాలనలో శెట్టి బలిజలకు అడుగడుగునా అవమానాలే. అయిన గాని ఆసవాళ్లను ఎదుర్కొని పైకి వచ్చి తమ ఆత్మాభిమానానికి ఎక్కడ భంగం కలగ కుండా నిలబడిన జాతి శెట్టి బలిజలు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత శెట్టి బలిజల జీవితాల్లో కొత్త వెలుగులు ఆరంభమయ్యాయి. రాజకీయంగా కూడా శెట్టి బలిజలకు అగ్ర తాంబూలం దక్కింది.
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జారీ చేసిన కొన్ని మెమోలు, ఉత్తర్వుల వల్ల శెట్టి బలిజల ప్రత్యేక అస్తిత్వానికి భంగం కలిగింది. కొన్ని ఉప-కులాలతో క్లబ్ చేయడం వల్ల తమ సామాజిక వర్గానికి రిజర్వేషన్ల పరంగా నష్టం వాటిల్లింది. అంతేకాదు గత శాసనసభ లోక్ సభ ఎన్నికల్లో శెట్టి బలిజలకు టిక్కెట్లు కేటాయింపులో ప్రాధాన్యత ఇచ్చామని చెప్పుకునే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆ సామాజిక వర్గం సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించింది. టిక్కేట్లు ముఖ్యం కాదు సంక్షేమం కావాలని శెట్టి బలిజలు గగ్గోలు పెట్టిన నాటి ప్రభుత్వం పెడ చెవిన పెట్టింది. అందుకే శెట్టిబలిజలు వైసీపీ ప్రభుత్వానికి కర్ర కాల్చి వాత పెట్టారు.
కోస్తా ఆంధ్ర ప్రాంతంలో, ముఖ్యంగా ఉమ్మడి గోదావరి జిల్లాల్లో శెట్టి బలిజలు రాజకీయంగా అత్యంత బలమైన వర్గం. ఎన్నికల టికెట్ల కేటాయింపులు, స్థానిక సంస్థల పదవుల విషయంలో తమ సామాజిక వర్గానికి తగిన ప్రాధాన్యం ఇవ్వకుండా నిర్లక్ష్యం చేశారు. అందుకే శెట్టి బలిజలంతా ఐక్యమై వైసీపీకి ఓటమికి కంకణం కట్టుకుని కూటమి కి మద్దతు పలికారు. శెట్టి బలిజల సత్తా ఏమిటో నిరూపించారు.
వైసీపీ అయిదేళ్ళపాలనలో అణగదొక్కబడిన శెట్టి బలిజలకు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే వాళ్ళ ఆత్మాభిమానాన్ని గౌరవించింది.ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుశెట్టిబలిజ (గౌడ, ఈడిగ) సామాజికవర్గానికి రాజకీయంగా, ఆర్థికంగా తగిన ప్రాధాన్యత కల్పించారు.
గత ప్రభుత్వ కాలంలో నిర్వీర్యమైన శెట్టిబలిజ సంక్షేమ కార్పొరేషన్‌ను కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పునరుద్ధరించి, బలోపేతం చేసింది. ఈ కులాల సమగ్ర అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయిస్తూ, చైర్మన్, డైరెక్టర్ల ఆధ్వర్యంలో సంక్షేమ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తోంది.
గీత వృత్తిని నమ్ముకున్న శెట్టిబలిజ, గౌడ కులాల ఆర్థికాభివృద్ధికి తోడ్పడేలా కూటమి ప్రభుత్వం తన నూతన లిక్కర్ పాలసీలో 10 శాతం దుకాణాలను గీత కులాల వారికి కేటాయించేలా నిర్ణయాలు తీసుకుంది.
శెట్టిబలిజల గుర్తింపునకు సంబంధించి గతంలో వచ్చిన వివాదాస్పద జీవోలపై స్పందిస్తూ, శెట్టిబలిజలకు “శెట్టిబలిజ” పేరుతోనే కుల ధృవీకరణ పత్రాలు అందేలా ప్రత్యేక ఉత్తర్వులను జారీ చేసి ఆ సామాజిక వర్గం ఆత్మాభిమానాన్ని చంద్రన్న ప్రభుత్వం నిలబెట్టింది. గత ప్రభుత్వం శెట్టి బలిజ(గౌడ) అనే పేరుతో కులధృవీకరణ పత్రాలను జారీ చేసే విధంగా జీవోను తెచ్చి శెట్టిబలిజలను మానసిక క్షోభకు గురిచేసింది. శెట్టి బలిజల ఆవేదనను అర్ధం చేసుకున్న ముఖ్యమంత్రి గౌడ అనే పదాన్ని తొలగిస్తూ కేవలం శెట్టి బలిజ అనే పేరుతో ధృవీకరణ పత్రాల జారీకి ప్రత్యేక జీవోను విడుదలచేసి ఆ సామాజికవర్గం ఆత్మగౌరవానికి విలువ నిచ్చారు.
శెట్టిబలిజ సామాజికవర్గానికి ఐక్యత, ఆత్మగౌరవాన్ని అందించిన ప్రతీక శెట్టిబలిజ జాతిపిత దొమ్మేటి వెంకటరెడ్డి జయంతిని కూటమి ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం రాష్ట్రంలోని శెట్టి బలిజలందరికీ గర్వకారణం.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే దొమ్మేటి వెంకటరెడ్డి జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహిస్తామని యువగళం పాదయాత్రలో మంత్రి నారా లోకేష్ శెట్టి బలిజలకు హామీ ఇచ్చారు. ఆ హామీని అమలు చేసిన లోకేష్ శెట్టి బలిజ కులస్తుల హృదయాల్లో చిరస్ధాయిగా నిలిచిపోతారు.
అంతేకాకుండా దోమ్మేటి వెంకటరెడ్డి జ్ఞాపకార్ధం బొడెసలకురు బ్రిడ్డికి ఆయన పేరు పెట్టడమే కాక విగ్రహాన్ని కూడ నెలకొల్పేందుకు కూటమి ప్రభుత్వం నిర్ణయించడం హర్షణీయం.
చంద్రన్న పాలనలో గీతకార్మికులకు భీమా సౌకర్యం కల్పించడం జరుగు తోంది.ప్రమాదవశాత్తు తాటిచెట్ల పై నుండి జారీపడి మృతి చెందిన గీత కార్మికుల కుటుంబాలకు రూ అయిదు లక్షలు ఎక్స్ గ్రేషియో చెల్లించడానికి కూడ ముఖ్యమంత్రి సుముఖత చూపడం ఆ సామాజిక వర్గం పట్ల ఆయనకు ఉన్న చిత్తశుద్దిని తేట తెల్లం చేస్తున్నది.
చంద్రబాబు నాయుడు సారధ్యంలో కూటమి ప్రభుత్వం శెట్టిబలిజ సామాజిక వర్గం అభ్యున్నతి, ఆత్మగౌరవం కోసం, హక్కుల పరిరక్షణ కోసం అనేక చారిత్రాత్మక నిర్ణయాలు అమలు చేస్తోంది. మాటల్లో కాకుండా చేతల్లో కూటమి ప్రభుత్వం చిత్తశుద్దిని నిరూపిస్తోంది.
రాష్ట్రంలోని శెట్టిబలిజల భవిష్యత్తుకు బలమైన పునాదులు వేస్తూ వారి సర్వతోముఖాభివృధ్ధికి చంద్రన్న నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ఎప్పుడూ కట్టుబడి ఉంటుందన్నారు.