జిల్లా ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు : జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల
నెల్లూరు, సెప్టెంబర్ 13: జిల్లా ప్రజలందరికీ జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుడు జిల్లా ప్రజలందరికీ సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, శాంతి, సౌభాగ్యాలను ప్రసాదించాలని, ప్రతి కుటుంబం ఆనందంగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు.
జిల్లా సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు జిల్లా యంత్రాంగం సమన్వయంతో పనిచేస్తోందని కలెక్టర్ తెలిపారు.
వినాయక చవితి వేడుకలను జిల్లాలో భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకునేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో అవసరమైన ఏర్పాట్లు చేపట్టారని కలెక్టర్ తెలిపారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పూజా మండపాలు, దేవాలయాల వద్ద పారిశుద్ధ్యం, తాగునీరు, విద్యుత్, భద్రత తదితర సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి సారించామని చెప్పారు. ప్రజలు కూడా అధికారులకు సహకరిస్తూ పర్యావరణహితంగా, ప్రశాంతంగా పండుగను జరుపుకోవాలని కోరారు.
జిల్లాలో కొనసాగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు మరింత విజయవంతంగా ముందుకు సాగాలని, పరిశ్రమల స్థాపన ద్వారా యువతకు విస్తృతమైన ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించాలని, జిల్లా అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలని గణనాథుడిని ప్రార్థిస్తున్నట్లు కలెక్టర్ హిమాన్షు శుక్లా తెలిపారు. జిల్లా ప్రజలందరిపై విఘ్నేశ్వరుని ఆశీస్సులు పుష్కలంగా ఉండాలని, ప్రతి ఒక్కరి జీవితంలో సుఖశాంతులు, సంతోషం వెల్లివిరియాలని ఆయన ఆకాంక్షించారు.
వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన జాయింట్ కలెక్టర్
జిల్లా ప్రజలందరికీ జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలందరూ పండుగను ఆనందంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. జిల్లా ప్రజలందరూ పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి గణపతిని పూజించాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.