✨ ✨ ఏఐ ముఖ్యాంశాలు (AI Key Bullets)
  • ఈ వార్తకు సంబంధించిన అత్యంత ముఖ్యమైన తాజా సమాచారం.
  • ప్రభుత్వం మరియు అధికారుల నుంచి వచ్చిన అధికారిక ప్రకటనలు.
  • ప్రజలు తెలుసుకోవాల్సిన ముఖ్యాంశాలు మరియు తదుపరి పరిణామాలు.

విశాఖపట్నం డివిజన్ అభివృద్ధి, ఆధునీకరణ కార్యక్రమాలను పరిశీలించిన జైపూర్ జర్నలిస్టుల బృందం

విశాఖపట్నం, సెప్టెంబర్ 24, (నిఘా ప్రతినిధి):రాజస్థాన్‌లోని జైపూర్‌కు చెందిన జర్నలిస్టుల బృందం, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB), జైపూర్‌కు చెందిన అసిస్టెంట్ డైరెక్టర్ (IIS)  అమిత్ కనౌజియా నాయకత్వంలో, విశాఖపట్నం డివిజన్‌ను సందర్శించింది. ఈ సందర్భంగా జర్నలిస్టుల బృందం విశాఖపట్నం డివిజనల్ రైల్వే మేనేజర్  లలిత్ బొహ్రా మరియు సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్  కె. పవన్ కుమార్లను DRM కార్యాలయంలో కలుసుకుంది.
ఈ సందర్భంగా DRM  లలిత్ బొహ్రా విశాఖపట్నం డివిజన్ సాధించిన వివిధ విజయాలు, పనితీరు, భద్రతా చర్యలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, ప్రయాణికుల సౌకర్యాల మెరుగుదల తదితర అంశాలను జర్నలిస్టులకు వివరించారు.
Sr. DCM  కె. పవన్ కుమార్ డివిజన్ పరిధిలోని వివిధ రైల్వే స్టేషన్లలో చేపడుతున్న స్టేషన్ అభివృద్ధి మరియు ఆధునీకరణ ప్రాజెక్టుల గురించి వివరించారు. స్టేషన్లలో ప్రయాణికుల సౌకర్యాలను మెరుగుపరచడం, ఆధునిక మౌలిక సదుపాయాలను కల్పించడం, స్టేషన్లను ఆధునిక రవాణా కేంద్రాలుగా అభివృద్ధి చేయడం కోసం చేపడుతున్న చర్యలను వివరించారు.
అనంతరం జర్నలిస్టుల బృందం రైల్వే అధికారులు చేపడుతున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాలపై వివరాలు తెలుసుకుని, పలు అంశాలపై అధికారులతో పరస్పర చర్చ జరిపింది.
ఈ పర్యటన ద్వారా కుమార్లనుఆధునికీకరణ చర్యలు మరియు ప్రయాణికులకు కుమార్లనుచేపడుతున్న కార్యక్రమాలపై జైపూర్ నుంచి వచ్చిన మీడియా ప్రతినిధులకు సమగ్ర అవగాహన కలిగింది.

వార్తను షేర్ చేయండి:

మీ అభిప్రాయాన్ని తెలియజేయండి / Leave a Comment

మీ ఈమెయిల్ ఐడీ గోప్యంగా ఉంచబడుతుంది.

సంబంధిత వార్తలు (Related News)

పరిషత్ ఎన్నికలకు సర్వం సిద్ధం:జిల్లా క‌లెక్ట‌ర్, ఎన్నిక‌ల అధికారి ఎం. అభిషిక్త్ కిశోర్

  •అక్టోబర్ 21 నుంచి నామినేషన్ల స్వీకరణ ప్ర‌క్రియ‌ •53 ఎంపీటీసీ, 04 జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు పటిష్ట…