✨ ✨ ఏఐ ముఖ్యాంశాలు (AI Key Bullets)
  • ఈ వార్తకు సంబంధించిన అత్యంత ముఖ్యమైన తాజా సమాచారం.
  • ప్రభుత్వం మరియు అధికారుల నుంచి వచ్చిన అధికారిక ప్రకటనలు.
  • ప్రజలు తెలుసుకోవాల్సిన ముఖ్యాంశాలు మరియు తదుపరి పరిణామాలు.

 

ఈవీఎం గోదాముల్లో భద్రతా ప్రమాణాలపై కలెక్టర్ తనిఖీ

విశాఖపట్నం, సెప్టెంబర్ 26, : చినగదిలి పరిధిలోని ఈవీఎం గోదాములను జిల్లా కలెక్టర్ ఎం. అభిషిక్త్ కిశోర్ శనివారం వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి తనిఖీ చేశారు. ఎన్నికల క‌మిష‌న్ మార్గదర్శకాల మేరకు ఈవీఎం, వీవీప్యాట్ యంత్రాలను భద్రపరిచిన గోదాముల్లో భద్రతా ప్రమాణాలు, పర్యవేక్షణ ఏర్పాట్లు సక్రమంగా అమలవుతున్నాయా లేదా అనే అంశాలను పరిశీలించారు. మూడు నెలలకొకసారి నిర్వహించే సాధారణ తనిఖీల్లో భాగంగా గోదాముల పరిసరాలు, భద్రతా ఏర్పాట్లు, సీసీ కెమెరాల పనితీరు, ష‌ట్ట‌ర్లు, భద్రతా సిబ్బంది విధులు తదితర అంశాలను పరిశీలించారు. గోదాముల తాళాలు, సీల్ వ్యవస్థ, రికార్డుల నిర్వహణ గురించి సంబంధిత అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. గోదాముల వద్ద భద్రతా ఏర్పాట్లలో ఎలాంటి లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలని సూచించారు. వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, ఎన్నికల విభాగం అధికారులు, సంబంధిత సిబ్బంది పాల్గొన్నారు.

విశాఖపట్నం, సెప్టెంబర్ 26: చినగదిలి పరిధిలోని ఈవీఎం గోదాములను జిల్లా కలెక్టర్ ఎం. అభిషిక్త్ కిశోర్ శనివారం వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి తనిఖీ చేశారు. ఎన్నికల క‌మిష‌న్ మార్గదర్శకాల మేరకు ఈవీఎం, వీవీప్యాట్ యంత్రాలను భద్రపరిచిన గోదాముల్లో భద్రతా ప్రమాణాలు, పర్యవేక్షణ ఏర్పాట్లు సక్రమంగా అమలవుతున్నాయా లేదా అనే అంశాలను పరిశీలించారు. మూడు నెలలకొకసారి నిర్వహించే సాధారణ తనిఖీల్లో భాగంగా గోదాముల పరిసరాలు, భద్రతా ఏర్పాట్లు, సీసీ కెమెరాల పనితీరు, ష‌ట్ట‌ర్లు, భద్రతా సిబ్బంది విధులు తదితర అంశాలను పరిశీలించారు. గోదాముల తాళాలు, సీల్ వ్యవస్థ, రికార్డుల నిర్వహణ గురించి సంబంధిత అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. గోదాముల వద్ద భద్రతా ఏర్పాట్లలో ఎలాంటి లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలని సూచించారు. వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, ఎన్నికల విభాగం అధికారులు, సంబంధిత సిబ్బంది పాల్గొన్నారు.

వార్తను షేర్ చేయండి:

మీ అభిప్రాయాన్ని తెలియజేయండి / Leave a Comment

మీ ఈమెయిల్ ఐడీ గోప్యంగా ఉంచబడుతుంది.

సంబంధిత వార్తలు (Related News)

పరిషత్ ఎన్నికలకు సర్వం సిద్ధం:జిల్లా క‌లెక్ట‌ర్, ఎన్నిక‌ల అధికారి ఎం. అభిషిక్త్ కిశోర్

  •అక్టోబర్ 21 నుంచి నామినేషన్ల స్వీకరణ ప్ర‌క్రియ‌ •53 ఎంపీటీసీ, 04 జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు పటిష్ట…