✨ ✨ ఏఐ ముఖ్యాంశాలు (AI Key Bullets)
  • ఈ వార్తకు సంబంధించిన అత్యంత ముఖ్యమైన తాజా సమాచారం.
  • ప్రభుత్వం మరియు అధికారుల నుంచి వచ్చిన అధికారిక ప్రకటనలు.
  • ప్రజలు తెలుసుకోవాల్సిన ముఖ్యాంశాలు మరియు తదుపరి పరిణామాలు.

72 అడుగుల డూండి గణేశుని దర్శించుకున్న మంత్రి నారా లోకేష్

సితార గ్రౌండ్స్‌లో ఘనంగా వినాయక చవితి వేడుకలు.. ప్రత్యేక పూజలు

డుండి గణేష్ సేవాసమితి సభ్యుల తో కలిసి లోకేష్ కు స్వాగతం పలికిన ఎంపీ కేశినేని శివనాధ్(చిన్ని)

విజయవాడ( సితార సెంటర్ డూండీ గణేష్): విజయవాడ పశ్చిమ నియోజకవర్గం సితార గ్రౌండ్స్‌లో డూండి గణేష్ సేవా సమితి ఆధ్వర్యంలో ఘనంగా ఏర్పాటు చేసిన 72 అడుగుల భారీ డూండి గణేశుని ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ దర్శించుకున్నారు. విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని)తో కలిసి మంత్రి నారా లోకేష్ గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించి, విఘ్నేశ్వరుని ఆశీస్సులు పొందారు.

సితార గ్రౌండ్స్‌కు చేరుకున్న మంత్రి నారా లోకేష్‌కు డూండి గణేష్ సేవా సమితి సభ్యులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. మేళతాళాలు, భక్తుల సందడి మధ్య మంత్రి లోకేష్‌కు ఎంపీ కేశినేని చిన్ని ఆత్మీయ స్వాగతం పలికారు. అనంతరం 72 అడుగుల ఎత్తులో కొలువుదీరిన భారీ గణేశుని విగ్రహాన్ని మంత్రి లోకేష్, ఎంపీ చిన్ని దర్శించుకున్నారు.వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేద పండితులు మంత్రి నారా లోకేష్‌కు ఆశీర్వచనాలు అందించారు. భక్తిశ్రద్ధలతో జరుగుతున్న వినాయక చవితి వేడుకలలో పాల్గొన్న మంత్రి లోకేష్, గణేశుని వైభవాన్ని వీక్షించారు.

ఈ సందర్భంగా సితార గ్రౌండ్స్‌లో వినాయక చవితి వేడుకల కోసం చేసిన ఏర్పాట్లను మంత్రి నారా లోకేష్, ఎంపీ కేశినేని చిన్ని పరిశీలించారు. గణనాథుని దర్శనానికి వచ్చిన భక్తులను పలకరిస్తూ వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చేపట్టిన ఏర్పాట్లను పరిశీలించారు.డూండి గణేశుని సన్నిధిలో విజయవాడ నగర అభివృద్ధి, ప్రజల సంక్షేమం, రాష్ట్ర ప్రగతి కోసం మంత్రి నారా లోకేష్, ఎంపీ కేశినేని చిన్ని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. విఘ్నేశ్వరుని ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు.72 అడుగుల భారీ గణేశుని విగ్రహం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. వినాయక చవితి సందర్భంగా సితార గ్రౌండ్స్‌లో భక్తుల సందడి నెలకొంది. మంత్రి నారా లోకేష్ పర్యటనతో వేడుకల ప్రాంగణంలో ప్రత్యేక ఉత్సాహం కనిపించింది.

ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గద్దె అనురాధ, ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్, డూండి గణేష్ సేవా సమితి అధ్యక్షులు డూండి రాకేష్, టీడీపీ పశ్చిమ నియోజకవర్గ ఇన్‌చార్జి బుద్ధా వెంకన్న, నూర్‌బాషా కార్పొరేషన్ చైర్మన్ నాగుల్ మీరా, బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ చైర్మన్ రఘురామరాజు, గ్రంథాలయ చైర్మన్ ఎంఎస్ బేగ్, బోండా సిద్ధార్థ, గద్దె క్రాంతి, దేవినేని చందు, డూండి గణేష్ సేవా సమితి సభ్యులు పేర్ల రవి, దర్శి రవి, ముక్తేశ్వరరావు, దర్శి సుబ్బారావు, టీడీపీ నాయకులు, శ్రేణులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

వార్తను షేర్ చేయండి:

మీ అభిప్రాయాన్ని తెలియజేయండి / Leave a Comment

మీ ఈమెయిల్ ఐడీ గోప్యంగా ఉంచబడుతుంది.

సంబంధిత వార్తలు (Related News)

పరిషత్ ఎన్నికలకు సర్వం సిద్ధం:జిల్లా క‌లెక్ట‌ర్, ఎన్నిక‌ల అధికారి ఎం. అభిషిక్త్ కిశోర్

  •అక్టోబర్ 21 నుంచి నామినేషన్ల స్వీకరణ ప్ర‌క్రియ‌ •53 ఎంపీటీసీ, 04 జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు పటిష్ట…