✨ ✨ ఏఐ ముఖ్యాంశాలు (AI Key Bullets)
  • ఈ వార్తకు సంబంధించిన అత్యంత ముఖ్యమైన తాజా సమాచారం.
  • ప్రభుత్వం మరియు అధికారుల నుంచి వచ్చిన అధికారిక ప్రకటనలు.
  • ప్రజలు తెలుసుకోవాల్సిన ముఖ్యాంశాలు మరియు తదుపరి పరిణామాలు.

జివిఎంసి ఎన్నికలవేళ ఓకే కాలనీలో సామాజిక భవనాల మీద సామాజిక భవనాలు

 

విశాఖపట్నం, నిఘా ప్రత్యేక ప్రతినిధి:ఒకే కాలనీలో రెండు సామాజిక భవనాల నిర్మాణానికి జీవీఎంసీ ముందుకు రావడం ఆరోపణలకు తావిస్తోంది. గతంలో అనేక కాలనీలో లక్షలాది రూపాయలు వెచ్చించి నిర్మించిన సామాజిక భవనాలు నిర్వహణలేక నిరుపయోగంగా పడి ఉన్న సంగతి తెలిసిందే. ఇవేవీ పట్టనట్లు జీవీఎంసీ ఎన్నికలు దగ్గర పడడంతో 86వ వార్డు జూపల్లినగర్ లో వివాదాస్పద స్థలంలో మరో సామాజిక భవనానికి శుక్రవారం శంకుస్థాపన చేయడం చర్చనీయాంశంగా మారింది.

ఎందుకో ఇంత హడావిడి

జీవీఎంసీ ఎన్నికలు దగ్గర పడుతుండడంతో ప్రజలను మభ్యపెట్టేందుకు వార్డు తెదేపా నాయకులు స్థానిక ఎమ్మెల్యేను తప్పుదోవ పట్టించి సామాజిక భవనం నిర్మాణానికి హడావిడిగా శంకుస్థాపన చేయించారు. రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన స్టేటస్ కో ను బేఖాతరు చేసి కూర్మన్నపాలెం సర్వే నెం.47లో జూపల్లినగర్ పక్కనున్న వివాదాస్పద స్థలంలో నిధులు కేటాయించకుండానే శంకుస్థాపన చేయడం జీవీఎంసీ ఇంజినీరింగ్ అధికారుల అత్యుత్సాహానికి అద్దంపడుతోంది. వార్డు తెదేపా నాయకులు, స్థానిక ఎమ్మెల్యేنيا

అధికారుల అత్యుత్సాహానికి అద్దంపడుతోంది. వార్డు తెదేపా నాయకులు, స్థానిక ఎమ్మెల్యే మెప్పుకోసం జీవీఎంసీ అధికారులు సామాజిక భవనం శంకుస్థాపనకు ముందుకు వచ్చారన్న ఆరోపణలు వస్తున్నాయి. సదరు సర్వే నెం.47లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టరాదని, యదావిధి స్థితి కొనసాగించాలని హైకోర్టు 2025లో స్టేటస్ కో ఇచ్చినా పట్టనట్లు వ్యవహరించారు.

సామాజిక భవనం నిర్మాణంలో ఉండగా..

జూపల్లినగర్ లో రూ.36 లక్షలతో సామాజిక భవనం నిర్మాణ దశలో ఉండగా మరో భవనం నిర్మాణం చేపట్టేందుకు శంకుస్థాపన చేయడం విమర్శలకు తావిస్తోంది. ఒకే కాలనీలో రెండు సామాజిక భవనాలు నిర్మించాల్సిన అవసరమేమొచ్చిందని ప్రశ్నిస్తున్నారు. వివాదాస్పద స్థలంలో రూ.49 లక్షలతో భవన నిర్మాణం చేపట్టేందుకు జీవీఎంసీ ముందుకు రావడాన్ని తప్పుబడుతున్నారు.

నిధులు కేటాయించకుండానే..

సామాజిక భవన నిర్మాణానికి ఎలాంటి నిధులు కేటాయించకుండా శంకుస్థాపన చేసి ప్రజలను మభ్యపెట్టారు. దీనికి సంబంధించి ఎలాంటి టెండర్లు పిలువలేదు. గతంలో ఇదే సర్వే నెంబరులో దుకాణ సముదాయాల నిర్మాణానికి జీవీఎంసీ రూ.కోటి కేటాయించింది. స్థలం కోర్టు పరిధిలో ఉండడంతో నేటికి నిర్మాణానికి ముందుకు రాలేదు. ఇప్పుడురూ.కోటీ కటాయించింది.

స్థలం కోర్టు పరిధిలో ఉండడంతో నేటికి నిర్మాణానికి ముందుకు రాలేదు. ఇప్పుడు మరోసారి సామాజిక భవనం కోసం శంకుస్థాపన చేయడంలో ఆంతర్యమేమిటో అధికారులకే తెలియాలి. దుకాణాలకు మంజూరు చేసిన నిధులు మళ్లించి సామాజిక భవనం చేపట్టాలని ప్రయత్నించి నిబంధనలు తంగలో తొక్కుతున్నారు. |

వార్తను షేర్ చేయండి:

మీ అభిప్రాయాన్ని తెలియజేయండి / Leave a Comment

మీ ఈమెయిల్ ఐడీ గోప్యంగా ఉంచబడుతుంది.

సంబంధిత వార్తలు (Related News)

పరిషత్ ఎన్నికలకు సర్వం సిద్ధం:జిల్లా క‌లెక్ట‌ర్, ఎన్నిక‌ల అధికారి ఎం. అభిషిక్త్ కిశోర్

  •అక్టోబర్ 21 నుంచి నామినేషన్ల స్వీకరణ ప్ర‌క్రియ‌ •53 ఎంపీటీసీ, 04 జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు పటిష్ట…