ప్రాణ, పశు నష్టం జరగకుండా యుద్ధ ప్రాతిపదికన ముందస్తు రక్షణ చర్యలు చేపట్టాలి:జిల్లా కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిర ప్రసాద్ కాకినాడ, సెప్టెంబర్25( నిఘా ప్రతినిధి): రానున్న మూడు రోజులు జిల్లాలో భారీ వర్షాలు మరియు తుఫాను ముప్పు నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అత్యంత అప్రమత్తంగా ఉండాలని,వర్షాల వల్ల ఎలాంటి ప్రాణ నష్టం,పశునష్టం జరగ కుండా తగిన చర్యలు చేపట్టాలని అధికారులను జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ ఆదేశించారు.జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి వివిధ శాఖల అధికారులతో జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా తుఫాను సన్నాహక సమీక్షా సమా వేశం లో జిల్లా కలెక్టర్ అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ మాట్లాడుతూ జిల్లాలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నందున జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని క్షేత్రస్థాయిలో ఉండే అధికారులు, మండల జిల్లా స్థాయి అధికారులు వారి వారి ప్రధాన కార్య స్థానాలలో అందుబాటులో ఉండాలని ఆదేశించారు. ముంపు ముప్పు ఉన్న ప్రాంతాల్లో ఇసుక కొరత లేకుండా చూడాలని, అవసరమైన చోట్లకు ఇసుకను తరలించడానికి ముందస్తుగా నిల్వ పాయింట్లను మరియు ఇసుక సంచులను సిద్ధం చేయాలని ఆదేశించారు. గండిపడే అవకాశం ఉన్న కాలవ గట్లు, చెరువు గట్లను ముందే గుర్తించి బలోపేతం చేయాలని,ఎమ్ఐ ట్యాంకుల వద్ద అవసరమైన మెటీరియల్ అందుబాటు లో ఉంచుకోవాలని స్పష్టం చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు చర్యలు చేపట్టాలని…వర్షపాతం ఎక్కువగా నమోదు అయ్యే అవకాశం ఉన్నందున నదులు, చెరువులు, వాగుల వద్ద నీటిమట్టం పెరిగే అవకాశం ఉంటుందని ఇరిగేషన్ అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. చెరువులు, వాగులు, వంకల వద్ద నిరంతరం గస్తి నిర్వహించాలని, నీటి ప్రవాహం ఎక్కువగా ఉండే చోట ప్రజలు,పిల్లలు వెళ్లకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు విద్యుత్ సరఫరాకు ఎలాంటి అంతరాయం కలగకుండా ఈపీడీసీఎల్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఆదేశించారు. వాలిపోయిన విద్యుత్ స్తంభాలు, కరెంట్ తీగలను పరిశీలించి, చెట్ల కొమ్మలను తొలగించాలని సూచించారు. సబ్స్టేషన్లలో నిలిచిన నీటిని తొలగించి, ఆస్పత్రులు మరియు అత్యవసర సేవలకు అంతరాయం కలగకుండా జనరేటర్లు, డీజిల్, విద్యుత్ స్తంభాలు, గ్యాంగ్ సిబ్బందిని సిద్ధంగా ఉంచాలన్నారు. మత్స్యకారులను వేటకు వెళ్లకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నామని ఫిషరీస్ అధికారులు తెలిపారు. ఆక్వా రైతులకు పవర్ కట్ అయితే జనరేటర్లు, డీజిల్ సిద్ధం చేసుకోవాలని సూచించామని, అవసరమైన స్విమ్మర్లు, పడవలను సిద్ధంగా ఉంచామని వివరించారు. వ్యవసాయ, ఉద్యానవన శాఖల అధికారులు రైతులనుచైతన్యపరచాలని, కోతకు వచ్చిన అరటి, బొప్పాయి, కూరగాయల పంటలను వెంటనే హార్వెస్ట్ చేసుకోవాలని సూచించారు.వర్షపాతం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ప్రత్యామ్నాయ పంటలకు ఉచితంగా విత్తనాల పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నట్లు అగ్రికల్చర్ అధికారులు తెలిపారు. ఆర్టీసీ అధికారులు ఎమర్జెన్సీ బస్సులను సిద్ధం చేయాలని డిజాస్టర్ రెస్పాన్స్ కోసం ఫైర్ డిపార్ట్మెంట్ మరియు ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలను సిద్ధంగా ఉంచాలని వెల్లడించారు. అధికారులు నిరంతరం మండలాల్లో పర్యటిస్తూ క్షేత్రస్థాయి పరిస్థితిని పర్యవేక్షించాలని, ప్రజా భద్రతే ధ్యేయంగా నాయకత్వ పటిమ చూపాలని కలెక్టర్ ఆదేశించారు. మూడు రోజులపాటు జిల్లా యంత్రాంగం పూర్తి అప్రమత్తం గా ఉంటుందని అధికారులందరూ సమన్వయంతో పని చేయడం ద్వారా ఈ విపత్తు నుండి బయటపడగలమని జిల్లా కలెక్టర్ ఆదేశించారు
✨ ఏఐ ముఖ్యాంశాలు (AI Key Bullets)
- ఈ వార్తకు సంబంధించిన అత్యంత ముఖ్యమైన తాజా సమాచారం.
- ప్రభుత్వం మరియు అధికారుల నుంచి వచ్చిన అధికారిక ప్రకటనలు.
- ప్రజలు తెలుసుకోవాల్సిన ముఖ్యాంశాలు మరియు తదుపరి పరిణామాలు.