✨ ✨ ఏఐ ముఖ్యాంశాలు (AI Key Bullets)
  • ఈ వార్తకు సంబంధించిన అత్యంత ముఖ్యమైన తాజా సమాచారం.
  • ప్రభుత్వం మరియు అధికారుల నుంచి వచ్చిన అధికారిక ప్రకటనలు.
  • ప్రజలు తెలుసుకోవాల్సిన ముఖ్యాంశాలు మరియు తదుపరి పరిణామాలు.
  • రాష్ట్రానికి పట్టిన చీడపురుగు జగన్ రెడ్డి,
  • బందరుకు శని గ్రహం పేర్ని నాని:మంత్రి కొల్లు రవీంద్ర
  • ఐదేళ్లు అధికారంలో ఉండి మున్సిపాలిటీకి రూపాయి ఖర్చు చేయలేదు
  • యుద్ధ ప్రాతిపదికన పూర్తవుతున్న బందరు పోర్టుపైనా కుట్రలు చేస్తున్నాడు
  • గంజాయి బ్యాచ్, వీధి రౌడీలతో జగన్ రెడ్డి రాష్ట్రాన్ని నాశనం చేయాలని చూస్తున్నాడు
  • జగన్ రెడ్డి లాంటి అరాచక శక్తిని తరిమికొడదామని మంత్రి కొల్లు రవీంద్ర పిలుపు
అమరావతి, సెప్టెంబరు 25 (నిఘా ప్రతినిధి): రాష్ట్రం అభివృద్ధి కంటే.. అరాచకం సృష్టించడమే ముఖ్యం అనేలా జగన్ రెడ్డి వ్యవహరిస్తున్నాడని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ధ్వజమెత్తారు. ఈ మేరకు ఆర్ అండ్ బీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఉపాధ్యాయ నియామకాలపై జగన్ రెడ్డి అండ్ కో ఏకంగా 350కి పైగా కేసులు వేశారు. అయినప్పటికీ కేసులన్నింటినీ పరిష్కరించి.. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 16 వేల ఉపాధ్యాయ నియామకాలు పూర్తి చేశాం. ఏడాదికి పైగా వారు ఉద్యోగాలు చేసుకున్నారు. మొదట మాస్ కాపీయింగ్ జరిగిందని ఆరోపణలు చేశారు. తర్వాత స్ప్రోట్స్ కోటాలో ఏదో జరిగిపోయిందని ఆరోపిస్తున్నారు. కానీ ఆధారాలు చూపమంటే మాత్రం పారిపోతున్నారు.ఇప్పుడు ఏకంగా శాప్ కార్యాలయంలో ఉన్న ఉపాధ్యాయులపై రౌడీషీటర్లు, గంజాయి బ్యాచ్‌తో దాడులకు ప్రయత్నించారు.
కృష్ణా జిల్లా అంటే రాజకీయంగా ఎంతో గొప్ప పేరు ఉంది. కానీ కృష్ణా జిల్లాలోని వైసీపీ నాయకులకు కనీస ఇంగితం కూడా లేకుండాపోయింది. రాజకీయాలు కృష్ణా జిల్లాకు కొత్తేమీ కాదు. కానీ.. వైసీపీ లాంటి నీచ రాజకీయాలు ఎవరూ చేయలేదు. బందరు అభివృద్ధిని అడ్డుకున్న వ్యక్తి దుర్మార్గుడు పేర్ని నాని. బందరు చరిత్రను నాశనం చేశాడు. ఐదేళ్లు మంత్రిగా ఉండి డ్రైనేజీలకు రూపాయి కూడా ఖర్చు చేయలేదు. గతంలో బందరు పోర్టు కోసం ఉద్యమాలు చేస్తున్న మిమ్మల్ని ఫ్యాబ్రికేటెడ్ ఉద్యమాలు అంటూ అవమానించాడు. ఉద్యమాలు చేసి ప్రభుత్వాలనే తలవంచేలా చేసి పోర్టు సాధించుకున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వంలో గాలికి వదిలేశారు. పోర్టు పూర్తి చేయకుంటే ముక్కు నేలకు రాస్తానన్న పేర్ని నాని తర్వాత సిగ్గు లేకుండా తిరుగుతున్నాడు.
         సాధారణ వ్యక్తులు కూడా పేర్ని నాని అరాచకాలను నిలదీస్తున్నారు. ప్రజలు అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా తప్పించుకుంటున్నాడు. బ్యాంకుల్ని ముంచేసి, ఎవరైనా ప్రశ్నిస్తే రాద్దాంతం చేస్తున్నాడు. వైసీపీ ఐదేళ్ల పాలనలో బందరు పోర్టును గాలికి వదిలేశారు. ఎన్నికల ముందు డ్రామాలాడాడు. ప్రజలిచ్చిన తీర్పుతో మేము పోర్టు పనులు వేగవంతంగా పూర్తి చేస్తున్నాం. పరిశ్రమలు తీసుకొస్తున్నాం. అలాంటి అభివృద్ధిపై కూడా ఏదో జరిగిపోతోందంటూ రాద్దాంతం చేస్తున్నాడు. ఇలాంటి వ్యక్తుల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ప్రజల్లో అలజడులు సృష్టించాలని ప్రయత్నిస్తే ఉపేక్షించేది లేదు. రైతులకు ఎలాంటి నష్టం లేకుండా.. భూములు సేకరిస్తాం. గతంలోనే ఎకరాకు రూ.25 లక్షల రూ.200 కోట్లు చెల్లించాం. గత రెండు సంవత్సరాల్లో మచిలీపట్నం మున్సిపాలిటీలో రూ.300 కోట్ల నిధులు తీసుకొచ్చి అభివృద్ధి పనులు చేస్తున్నాం. రోడ్లు, తాగునీటి ప్రాజెక్టులు, డ్రైనేజీలు, పార్కులు, శ్మశానవాటికలు అన్నింటినీ ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేస్తున్నాం. విజన్ డాక్యుమెంట్ తయారుచేసి.. రాబోయే 25 సంవత్సరాలను దృష్టిలో పెట్టుకుని అడుగులు వేస్తున్నాం.
          రోడ్లెక్కి బూతులు మాట్లాడడం, కులాలు మతాల మధ్య చిచ్చు పెట్టేలా వ్యవహరించడం తప్ప జగన్ రెడ్డికి ఏదీ సాధ్యం కాదు. అభివృద్ధిని అడ్డుకోవాలనుకోవడం సిగ్గుచేటు. రాష్ట్రంలో జగన్ రెడ్డి, బందరులో పేర్ని నాని అరాచకాలకు పాల్పడుతున్నాడు. గంజాయి బ్యాచ్‌తో అరాచకాలు చేస్తున్నారు. దాడులు చేయిస్తున్నాడు. ఇలాంటి వ్యక్తులను ప్రజలు తరిమి కొట్టాలి. మన బందరు అభివృద్ధిలో అందరం భాగస్వాములవుదాం. అబివృద్ధి ఫలాలను అందరం అనుభవిద్దాం. పేర్ని నాని లాంటి దుర్మార్గుల వ్యాఖ్యలు నమ్మి కూర్చొన్న కొమ్మను నరుక్కునే ప్రయత్నం చేయొద్దు. బందరుకి పరిశ్రమలు తీసుకొస్తాం. పెట్టుబడులు ఏర్పాటు చేస్తాం. ప్రతి ఒక్కరి జీవన ప్రమాణాలు పెంచడమే మా లక్ష్యం. మన బందరు చరిత్రని పునరుద్ధరించడమే కూటమి నాయకుల లక్ష్యమని మంత్ర ికొల్లు రవీంద్ర పేర్కొన్నారు.
వార్తను షేర్ చేయండి:

మీ అభిప్రాయాన్ని తెలియజేయండి / Leave a Comment

మీ ఈమెయిల్ ఐడీ గోప్యంగా ఉంచబడుతుంది.

సంబంధిత వార్తలు (Related News)

పరిషత్ ఎన్నికలకు సర్వం సిద్ధం:జిల్లా క‌లెక్ట‌ర్, ఎన్నిక‌ల అధికారి ఎం. అభిషిక్త్ కిశోర్

  •అక్టోబర్ 21 నుంచి నామినేషన్ల స్వీకరణ ప్ర‌క్రియ‌ •53 ఎంపీటీసీ, 04 జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు పటిష్ట…